దేశంలో నెంబర్ వన్ సీఎం అంటే చంద్రబాబే సినీ నటుడు ప్రశంసల వర్షం! ఆయనకు సమయం ఇవ్వాలి..
Sun Jun 15, 2025 16:35 Politics
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు తన అనుభవంతో, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక విజనరీ. ఎలాంటి సంక్షోభం వచ్చినా పరిష్కరించగలిగిన సమర్థుడు చంద్రబాబు. దేశంలోనే నెంబర్ వన్ సీఎం ఎవరంటే చంద్రబాబే. దెబ్బతిన్న రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం... అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఆయనకు కొంత సమయం ఇవ్వాలి. ఏది ముందు చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలి అనే ప్రాధాన్యతలు ఉంటాయి... మనకు కావాల్సింది ఇప్పుడే జరగాలి అంటే కుదరదు... అందుకోసం వేచిచూడాలి. చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. హైదరాబాద్ ను ఆయన అభివృద్ధి చేసిన తీరు అందుకు నిదర్శనం.
ఇది కూడా చదవండి: రండి... మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి! చంద్రబాబు, లోకేశ్ ప్రజలకు ఆహ్వానం!
ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వచ్చారు... కాదనడంలేదు... కానీ హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలతో ఒక ఆర్కిటెక్చర్ మ్యాప్ ను ఏర్పాటు చేసింది మాత్రం చంద్రబాబే. ఇవాళ ఏపీ అభివృద్ధి అంటే ఒక పరీక్ష వంటిది. దాదాపు ఎడారి వంటి ప్రాంతాన్ని సుభిక్షంగా తయారుచేయాలంటే ఆయనకు సమయం ఇవ్వాలి... మనమందరం సహకరించాలి. మనుషులు అన్న తర్వాత తప్పులు ఉంటాయి.. ఎవరూ పర్ఫెక్ట్ కాదు. అయితే ఆ తప్పు పెద్దదా, చిన్నదా అనేది చూడాలి. పెద్ద తప్పు అయితే మాట్లాడాలి, చిన్న తప్పు అయితే పట్టించుకోకూడదు. గత ప్రభుత్వం తప్పులు చేయలేదా? వాళ్లు కొన్ని మంచి పనులు చేశారు, కొంత చెడు కూడా జరిగింది. మనకు మోదీ గారి సహకారం ఉంది. ఆయన అండను వీలైనంతగా ఉపయోగించుకోవాలి" అని సుమన్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Suman #Chandrababu Naidu #Andhra Pradesh #AP CM #Telugu Actor #AP Development #YS Rajasekhara Reddy #KCR #Narendra Modi #Political News
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.